CreditCard: క్రెడిట్ కార్డు ఉన్నవాళ్లు ఇది తెలుసుకోకపోతే నష్టపోతారు..!

On: November 19, 2025 1:38 PM

CreditCard: క్రెడిట్ కార్డు ఒకప్పుడు కొంత మందికే అందుబాటులో ఉండేవి .కానీ నేడు బ్యాంకులు వీటిని విచ్చలవిడిగా జారీ చేస్తుండడంతో క్రెడిట్ కార్డు లేని వారంటూ లేరు. అయితే క్రెడిట్ కార్డు ఉన్నవారందరూ పూర్తి అవగాహనతో వాడకాపోవడం వల్ల చాల తప్పులు జరుగుతున్నాయి. క్రెడిట్ కార్డు మీద అవగాహనా లేకుండా ఉపయోగించడం వల్ల అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు.

కాబ్బటి వార్షిక రుసుములు, వడ్డీ రేటు, బిల్లింగ్ సైకిల్, క్రెడిట్ లిమిట్, గ్రేస్ పీరియడ్ వంటి వాటి గురించి తెలుసోకోవడం చాల ముఖ్యం. అప్పుడే క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది ! ఇంతకీ అవేంటని ఆలోచిస్తున్నారా. ఇప్పుడు అవేంటో చూదాం..

CreditCard: వార్షిక వడ్డీ పర్సెంటేజ్ ( APR )

క్రెడిట్ కార్డు యొక్క బిల్లును గడువులోగా పూర్తిగా లేదా సగమైనా చెల్లించకపోతే మిగిలిన మొత్తం పైన వేసే వడ్డీ రేటును ఏ పి ఆర్ అంటారు. ఇందులో సాధారణ వడ్డీ రేట్ తో పాటు ప్రోస్సేసింగ్ ఫీజు ఇంకా ఇతర చార్జీలు కూడా ఉంటాయి. సాధారణంగా ఈ వడ్డీ రేటు 38 శాతం నుండి 42 శాతం వరకు ఉంటుంది. పర్చస్, బాలన్స్ ట్రాన్స్ఫర్ వంటి వాటికీ వేరు వేరు ఏ పి ఆర్ లు ఉండొచ్చు.

Credit Card: వార్షిక రుసుము

యూసర్ క్రెడిట్ కార్డు వాడినందుకు గాను బ్యాంకు వాలు ప్రతి ఏటా వసూలు చేసే మొత్తని వార్షిక రుసుము అంటారు. కొన్ని కార్డు లకు మీరు ఈ రుసుము చెల్లించనవసరం లేదు. కొన్నింటికి మినిమం అమౌంట్ ఖర్చు చేస్తే ఈ ఫీజు ను మాఫీ చేస్తారు.

Credit Card: క్రెడిట్ లిమిట్

మీ ఆదాయం మరియు క్రెడిట్ స్కోర్ ఆధారంగా క్రెడిట్ కార్డు పై మీకు ఇచ్చే గరిష్ట మొత్తాన్ని క్రెడిట్ లిమిట్ అంటారు. దీని బ్యాంకులు లేదా కార్డులు జారీ చేసినవారు నిర్ణయిస్తారు.

Credit Card: మినిమం అమౌట్ డ్యూ  ( Minimum amount due )

CreditCard

మీరు తీసుకున్న మొత్తని గడువు లోగ చెల్లించకపోతే అదనపు చార్జీలు పడతాయి. వాటిని నివారించడానికి క్రెడిట్ కార్డు బిల్లులను గడువు లోగ కనీస మొత్తని చెల్లించాలి.

ఇది మీరు తీసుకున్న మొత్తం లో ఒక భాగం మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఇది మీరు తీసుకున్న మొత్తం లో 5 శాతం మాత్రమే ఉంటుంది. అయితే మిగిలిన బాలన్స్ ని తర్వాత బిల్లుకు జత చేస్తారు. దాని పై వడ్డీ కూడా ఉంటుంది.

బిల్లింగ్ సైకిల్

Credit Card - Billing Cycle

మీ యొక్క క్రెడిట్ కార్డు బిల్లు జెనరేట్ అయ్యే సమయాన్ని బిల్లింగ్ సైకిల్ అంటారు. సాధారణంగా ఇది 28 నుండి 31 రోజులు పడుతుంది. మీ ఒక క్రెడిట్ కార్డు( Creditcard ) లు జారీ చేసే కంపెనీ లు బిల్లింగ్ సైకిల్ ముగింపులో ఒక స్టేట్మెంట్ అందిస్తుంది.

మీరు చేసిన కొనుగోలు, మొత్తం బకాయి, కనీస బకాయి, పాత బకాయి మరియు కాష్ ట్రాన్స్ఫర్ బాలన్స్ కి సంబందించినవి అన్ని ఇందులో ఉంటాయి.

గ్రేస్ పీరియడ్

బిల్లింగ్ తేదికి మరియు చెల్లించాల్సిన తేదీ కి మధ్య ఉన్న కాలాన్ని క్రెడిట్ కార్డు( Creditcard ) గ్రేస్ పీరియడ్ అంటారు. ఈ సమయం లోనే మీ యొక్క మొత్తాన్ని చెల్లించాలి, లేనిచో మీరు కొనుగోలుచేసిన రెండో రోజు నుంచే వడ్డీ లెక్కిస్తారు.

ఆలస్య చెల్లింపు రుసుము

Credit Card

మీ యొక్క క్రెడిట్ కార్డు( Creditcard ) బిల్లును గడువు లోగ కనీస బకాయి ని కూడా చెల్లించకపోతే మీకు జరిమానా విధిస్తారు. దీనినే ఆలస్య చెల్లింపు రుసుము అని అంటారు. ఇది మీ బ్యాంకు లేదా జారీ చేసిన సంస్థ ను బట్టి 100 నుండి 1000 వరకు ఉండొచ్చు.

రివాల్వింగ్ క్రెడిట్

బిల్లు సమయానికి చెల్లిస్తూ ఉంటె మీ యొక్క క్రెడిట్ కార్డు లిమిట్ దానికి అదే పెరుగుతుంది.దీనినే రివాల్వింగ్ క్రెడిట్ అని అంటారు.

ఉదాహరణకి మీ లిమిట్ రెండు లక్షలు అనుకుంటే అందులో మీరు ఒక లక్ష ఖర్చుచేశారు అనుకుందాం, దానిని మీరు గడువు లోగ మీరు తీసుకున్న మొత్తని అంత చెల్లిస్తే మీ యొక్క లిమిట్ మల్లి తిరిగి 2 లక్షలు అవుతుంది లేదా మీరు సగమే తిరిగి కడితే మీ యొక్క లిమిట్ 1.5 లక్ష అవుతుంది.

కాబ్బటి ఈ విషయాలు అన్ని మీరు గ్రహించి మీ యొక్క డబ్బులుని ఆదా చేసుకోండి.

Read More: https://thepsdguy.com/x-twitter-down-for-many-users-posts-not-loading/

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment